Friday, February 13, 2026

సి ఎఫ్ నిధులు రూ, కోటి 95 లక్షలు గోల్మాల్…..!? పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి…. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి….. సిపిఐ నారాయణపేట జిల్లా కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్…..

నేటి సాక్షి, నారాయణపేట, మరికల్,ఫిబ్రవరి 13,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘాలలో సి ఎఫ్ నిధులు గోల్మాల్ చేశారని వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్ నారాయణపేట జిల్లా కలెక్టర్ ను కోరారు. శుక్రవారం ధన్వాడ మండల కేంద్రంలో స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2008 లో మండలంలోని వివిధ గ్రామాలలో దాదాపు 105 మహిళా సంఘాలకు సంబంధించిన సి ఎఫ్ నిధులు దాదాపు రూ, ఒక కోటి 95 లక్షల రూపాయలు గోల్మాల్ చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇట్టి నిధులపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలన్నారు. ఒక్క కోటి 95 లక్షల రూపాయలు నిధులు డ్రా చేసినట్లు పూర్తిస్థాయిలో పూర్తి వివరాలు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. మహిళా సంఘాలకు న్యాయం జరిగే వరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో స్థానిక మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News