నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 13 మండలంలోని పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మాఘమాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి ,అభయాంజనేయ స్వామికి, నాగభైరవ స్వామికి, పంచామృత అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చౌడేపల్లి, పుంగనూరు ,మదనపల్లి, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ రోజు ఉభయదారులుగా మదనపల్లికి చెందిన వెంకట్ రమణారెడ్డి షర్మిల లు వ్యవహరించారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు

