నేటి సాక్షి,నారాయణపేట ఫిబ్రవరి 14( రిపోర్టర్ ఇమామ్ సాబ్),భారతదేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 30,000 సీబీఎస్ఈ (CBSE) అనుబంధ పాఠశాలల నుంచి, విద్యా ప్రమాణాల ప్రాతిపదికన ఎంపిక చేసిన అత్యుత్తమ 30 పాఠశాలల్లో మన ప్రతిభ హై స్కూల్ ఒకటిగా నిలవడం మనందరికీ గర్వకారణం. *గౌరవ చైర్మన్ శ్రీ టి. హనుమంత్ రెడ్డి గారికి ‘భారత్ భూషణ్ సన్మాన్ 2.0’ పురస్కారం* విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు గాను… మన పాఠశాల చైర్మన్ శ్రీ టి. హనుమంత్ రెడ్డి గారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. శనివారం నాడు మహారాష్ట్రలో జరిగినటువంటి ‘భారత్ భూషణ్ సన్మాన్ 2.0 వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు”విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, అది ఒక బిడ్డ జీవితాన్ని మార్చే మహా శక్తిగా ఉండాలి” అనే ఆశయంతో అహర్నిశలు కృషి చేస్తున్న చైర్మన్ శ్రీ హనుమంత్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

