నేటి సాక్షి 14ఫిబ్రవరి జూపాడుబంగ్లా :–జూపాడుబంగ్లా మండల కేంద్రంలో నీ.. ఎంపిడిఓ ఆఫీసు నందు నులిపురుగుల పోస్టర్లను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు . నులిపురుల ఆల్బెండజోల్ పోస్టర్లను ఎంపిడిఓ గోపీకృష్ణ విడుదల చేశారు.1నుండి 19సంవత్సరాలు వయస్సు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా వారందరికీ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పీహెచ్సీసి డాక్టర్ సభ పేర్కొన్నారు.17వ తేదిన పిల్లలకు అందరికీ మాత్రలు పంపిణీ చేస్తారని ఆరోజు తీసుకొని వారికి 24 వ తేదీ మరోసారి పంపిణీ చేస్తామని సూపర్వైజర్స్ రాముడు, విజయలక్ష్మి తెలియజేశారు. అనంతరం నులిపురుగుల నివారణ, జాగ్రత్తలను సూచించే గోడ పత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం లో ల్యాబ్ టెక్నిషియన్ చెంచన్న, ఏఎన్ఎంలు శ్రీలత, నాగ జ్యోతి ఆశలు పాల్గొన్నారు.

