Saturday, February 14, 2026

*ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి**రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి**ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు*—————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………………. ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు తెలిపారు. ధర్నా పోస్టరును శనివారం ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య నాయకులు జగిత్యాల లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి, రాజన్న లు దేశవ్యాప్తంగా ఓసిల స్థితి గతులను అధ్యయనం చేసి జాతీయ స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని ఆర్ధికంగావెనుక బడి ఉన్నవారు రిజర్వేషన్లు లేమి కారణంగా అటు సంక్షేమ పథకాలఫలాలు ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిరుపేద ఓసి లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.అంబెడ్కర్ ఆలోచన విధానo ప్రకారం వెనుకబడిన తరగతుల వారికి పదేళ్ళ వరకు రిజర్వేషన్లు అమలుచ్చేయాలని అంటే 70 ఏళ్ళు దాటినా వాటిని అలానే కంటిన్యూ చేయడం వల్ల ఓసిలకు తీరని అన్యాయం జరుగుతున్నదాన్నారు. జనరల్ స్థానాల్లో కూడా ఓసి లకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వక పోవడం వల్ల రాజకీయంగానూ వెనుక బడి పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేందుకు జాతీయ ఈడబ్ల్యూఎస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్నలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా ఓసి నాయకులు సిరిసిల్ల వేణుగోపాల్, సిరిసిల్ల రాజేందర్ శర్మ, సంత గౌతమ్ రెడ్డి, పుల్లూరి సత్యనారాయణ, మేతే ఉమాపతి శర్మ, కటకం చంద్రమౌళి, అయిల్నేని స్వప్న రావు, దేవరశెట్టి జనార్దన్,బండారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News