నేటి సాక్షి 14 ఫిబ్రవరి పాములపాడు :– ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి దళిత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య105 జయంతిని స్థానిక సిపిఎం కార్యాలయంలో మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు కలబండి అంకన్న అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు సిపిఎం మండల కార్యదర్శి డి సోమన్న సిఐటియు మండల కార్యదర్శి మేకల రాజు మాట్లాడుతూ దేశంలో దళిత తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించాలని వారు కొనియాడారు ఎన్నో రాజకీయ పదవులు చేపట్టి అనుభవించినప్పటికీ నిస్వార్ధంగా నిజాయితీగా నిరాడంబరంగా జీవించారన్నారు అంతే కాకుండా ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు ఆయన చేసిన సేవలకు కర్నూలు జిల్లాలోని పెద్దపాడులొ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్షావలి రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి రామకృష్ణ ఆటో కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరుడు మల్లికార్జున బీసీ నేత సాయి కృష్ణ సోషల్ మీడియా ప్రతినిధులు గోవిందు శ్రీకాంత్ షర్బుద్దిన్ తదితరులు పాల్గొన్నారు

