Saturday, March 7, 2026

*చింతకుంట స్మశాన వాటిక స్థలం కబ్జాపై చర్యలు** అక్రమ షెడ్డు, గోడలను తొలగించిన మున్సిపల్ అధికారులు* ఫిర్యాదుకు స్పందించిన అధికారులు—–*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పట్టణంలోని చింతకుంట స్మశాన వాటిక స్థలం మరియు చెరువు ప్రాంతం కబ్జాకు గురవుతోందని మున్సిపల్ కమిషనర్‌కు మున్సిపల్ కౌన్సిలర్లు వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ అధికారులు పరిశీలన చేపట్టి అక్కడ ఏర్పాటు చేసిన అక్రమ షెడ్డు మరియు గోడలను తొలగించారు. ప్రజా అవసరాలకు సంబంధించిన స్థలాలను కబ్జా చేయడం సరికాదని అధికారులు హెచ్చరించారు.*స్మశాన వాటిక, చెరువు రక్షణపై దృష్టి*చింతకుంట ప్రాంతంలోని స్మశాన వాటిక స్థలం, చెరువు పరిసరాలు కొంతమంది వ్యక్తుల అక్రమ నిర్మాణాలకు గురవుతున్నాయని స్థానిక ప్రజలు, కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై అధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించి అక్రమంగా నిర్మించిన షెడ్డు, గోడలను తొలగించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు లింగంపేట శ్రీనివాస్, అరవ లక్ష్మీ, పంబల సుజాత రాము, కొండ అరుణ, సిరికొండ వరలక్ష్మీ, నిమ్మల నాగరాజు, గట్టపల్లి మానస, జ్ఞానేశ్వర్, దుబ్బ శ్రవణ్, వినీత్ గౌడ్, మధు, శ్రీరామ్, బిట్టు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన స్థలాలను కాపాడేందుకు తమ వంతు కృషి కొనసాగుతుందని వారు తెలిపారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News