నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని హాజీపురా 15వ వార్డు పరిధిలో మునిసిపల్ నిబంధనలకు విరుద్ధంగా సెట్‌బ్యాక్ లేకుండా భవన నిర్మాణం జరుగుతోందని స్థానిక నివాసులు ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.హాజీపురా ప్రాంతంలోని కిసాన్ మాల్ కింగ్స్ గార్డెన్ వీధిలో ఒక కొత్త భవన నిర్మాణం చేపడుతున్నారని, అయితే ఈ నిర్మాణం రోడ్డుకు అవసరమైన సెట్‌బ్యాక్ లేకుండా జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తూ మునిసిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు.*ప్రజల రాకపోకలకు ఇబ్బందులు*సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణం కొనసాగితే రహదారి విస్తీర్ణం తగ్గిపోయి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశముందని నివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు కూడా సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.*తక్షణ చర్యలు తీసుకోవాలి*ఈ నిర్మాణాన్ని అధికారులు వెంటనే పరిశీలించి, మునిసిపల్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ప్రజల భద్రతతోపాటు రహదారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు హాజీపురా నివాసి మిర్జా ముక్రం బైగ్ ఆధ్వర్యంలో స్థానికులు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.——





