నేటి సాక్షి – కోరుట్ల* (రాధారపు నర్సయ్య)కోరుట్ల మున్సిపాలిటీలో నిర్వహించిన తొలి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే ముందు బీజేపీ కౌన్సిలర్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.*అంబేద్కర్ విగ్రహానికి నివాళులు*కోరుట్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బీజేపీకి చెందిన కౌన్సిలర్లు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ అనంతరం కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు సోరూపాక రమాదేవి-రమేష్,ఇందూరి తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ, కలల రాధా-సాయిచంద్,గుగ్లావత్ శ్రీకాంత్ పాల్గొన్నారు. అనంతరం వారు కోరుట్ల మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.____





