Saturday, March 14, 2026

*గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలు పెంచాలి**మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి**కలెక్టర్ గరిమ అగ్రవాల్**ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సరీల్లో పరిశీలన*

*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News