Saturday, March 14, 2026

మన సంస్కృతిని, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు… నాటికలు ఎంతో దోహదపడతాయి-కవి, రచయిత వారణాసి ఆంజనేయులు

నేటిసాక్షి, మిర్యాలగూడ : మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి మేలుకొలిపే విధంగా సాంఘిక పద్య నాటికలు ఎంతగానో దోహదపడతాయని రిటైర్డ్ ఉపాధ్యాయులు, కవి, రచయిత, వారణాసి ఆంజనేయులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న నందినీ అవార్డ్స్-2026 జాతీయస్థాయి పద్య నాటక సాంఘిక నాటక పోటీలు శనివారం, ఆరవ రోజు తెలంగాణ నాటక సమాఖ్య సూర్యాపేట ఉపాధ్యక్షులు విలకత్తుల పుల్లయ్య తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. పద్యాల ద్వారా తెలుగు భాషలోని మాధుర్యం, స్పష్టమైన ఉచ్చారణ మరియు పదజాలంపై పట్టు పెరుగుతుందని, నాటికల్లోని ఇతివృత్తాలు క్రమశిక్షణ, సామాజిక బాధ్యత మరియు మానవీయ సంబంధాల పట్ల అవగాహన కలిగిస్తాయని, నేటి కార్యక్రమంలో భాగంగా మొదట చిన్నారులచే నృత్య కార్యక్రమాలు అనంతరం “శ్రీ ఖడ్గతిక్కన” పద్య నాటకం డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారిచే ప్రదర్శింపబడింది. అనంతరం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శాలువాలతో సన్మానించి, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. తదుపరి డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలి వారిచే ఇది కొత్త కథ సాంఘిక నాటిక ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు, అధ్యక్షులు రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి వెంకటలక్ష్మీనారాయణ శర్మ, సాయిలు, సత్యనారాయణ చారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, నాగమణి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, టంగుటూరి రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News