నేటి సాక్షి వికారాబాద్ :మహనీయులు రాజకీయ కోవిదులు భారత ఉప ప్రధానమంత్రి హరిత విప్లవ ప్రధాత కార్మిక పక్షపాతి భారత దేశంలో అతి చిన్న వయసులో ముఖ్యంగా దళిత సామాజిక వర్గం లో పుట్టి ఎన్నో పదవులను అధిరహించిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంతేకాకుండా ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం పార్లమెంట్ మెంబర్గా పనిచేసిన ఘనత ఆయనది అదేవిధంగా ఎన్నోసార్లు ఉత్తమ పార్లమెంటరీగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లాదేశ్ కి విముక్తి కలిగించిన మరో గొప్ప ఘన కీర్తిని అందుకున్న మహానీయులు ఆయన విగ్రహాన్ని ఏప్రిల్ నాలుగవ తేదీన కిష్టాపూర్ గ్రామం దోమ మండలం బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాది విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ లోని బారాసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోలీస్ వెంకటరెడ్డి జాయింట్ సెక్రటరీ పి ఆనంద్ సీనియర్ న్యాయవాదులు లవ కుమార్ గోవర్ధన్ రెడ్డి రామచంద్ర రావు జనార్దన్ రెడ్డి అశోక్ కుమార్ మహేష్,శుభప్రద్ పటేల్ మహేష్ రెడ్డి, చైతన్య కిరణ్, అశోక్,సిహెచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు యాదగిరి ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





