Monday, March 16, 2026

ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ నితికా పంత్బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులకు ఆదేశాలుప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ

నేటి సాక్షి,కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని, వాటిని చట్టపరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకుని అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి, శాంతి భద్రతలను కాపాడుతూ పోలీస్ శాఖ పని చేస్తోందని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, బాధితులు మరియు సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News