నేటి సాక్షి అనంతగిరి:సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో మంగళవారం అనారోగ్యంతో గొల్ల నరేష్.(40) మృతి చెందారు. బిఎస్ఎన్ఎల్ టాక్సి స్టాండ్ వర్కర్స్ యూనియన్ ఉప సర్పంచ్.. కుక్కల వీరబాబు ఇతర డ్రైవర్లతో కలిసి మృతుని స్వగృహానికి వెళ్లి, ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా 10000 ఇచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి, నరేష్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.





