నేటి సాక్షి 17 పాములపాడు:-పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ దండుపేటలో సిసి రోడ్డుకు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జి.హరి ప్రసాద్ యాదవ్ నాయకులతో కలిసి భూమి పూజ చేసి, పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయన్నారు. నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ల సహకారంతో దాదాపు 45 లక్షల వ్యయంతో, 7 సీసీ. రోడ్లను వేయడం జరుగుతుందన్నారు. గ్రామాభివృద్ధిలో అందరితో కలిసి పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి బూత్ కన్వీనర్ ఎల్.శివరాముడు, నాయకులు ఎల్.సురేష్, సాంబ, పెద్ద యాకోబు, పైల్వాన్, మౌలాలి, దేవరాజు, తదితరులు పాల్గొనడం జరిగింది.





