Tuesday, March 17, 2026

ఈద్-ఉల్-ఫితర్ శుభ్రత — ఆసిఫాబాద్ మునిసిపాలిటీ ప్రత్యేక చర్యలు..

నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్:ఆసిఫాబాద్ మునిసిపాలిటీ పరిధిలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను పురస్కరించుకొని ఈద్గా మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. పండుగ సందర్భంగా ప్రార్థనలు ప్రశాంతంగా, పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు మునిసిపల్ సిబ్బంది వేగవంతంగా పనులు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా మాజీ డిసిసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు మునిసిపల్ సిబ్బందికి శుభ్రత కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్లు కృష్ణమ్మ, రాపర్తి కార్తీక్, రాజంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు గులాం జావిద్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అసాద్, నూర్ నగర్ కాంగ్రెస్ నాయకుడు జమీర్ అహ్మద్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు.పరిశుభ్రమైన వాతావరణంలో ఈద్ ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News