నేటి సాక్షి నారాయణపేట మార్చు 17,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ బహిరంగ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో మక్తల్ ఎమ్మెల్యే గా గెలిపిస్తే, 1268 జీవో* ను, అమలు పరిచి, మదాసి మదారి కురువ లకు ఎస్సీ కుల ధ్రువీకరణ జారీ చేసేటట్టు ప్రభుత్వం తో మాట్లాడి కచ్చితంగా కృషి చేస్తానని, రాష్ట్ర పశు సంవర్ధక &క్రీడా శాఖ మంత్రి, శ్రీ. వాకిటి శ్రీహరి గారు మాట ఇవ్వడం జరిగిందని మాదాసి కురువ సంఘం ధన్వాడ మండల ప్రధాన కార్యదర్శి కురువ నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం నాడు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాట ఇచ్చి 2/2 సం” రాలు గడుస్తున్నా, కుడా ఒక్క అసెంబ్లీ సమావేశంలో కూడా మా సమస్య ను, ప్రభుత్వం దృష్టికి తీసుకెలుకపోవడం చాలా అక్చర్య కరమైనా విషయం. మా జిల్లా నాయకులు మంత్రివర్యులు లను ఎన్నిసార్లు కలిసిన, కూడా వాయిదాలు వేస్తూ వస్తున్నారు.ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో అయినా 1268 జీవో ను అమలుపరిచి, మంత్రి వాకిటి శ్రీహరి మదాసి కురువల ఏస్సీ కుల ధ్రువీకరణ పత్రాల సమస్య లపై అసెంబ్లీ లో ప్రస్థావించాలి అని, డిమాండ్ చేస్తున్నాం.లేని యెడల రాబోయే, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మదాసి మదారి కురువలా ఏందో చూడాల్సివస్తుంది. అని, హెచ్చరించారు.





