Tuesday, March 17, 2026

*మేడారంలో బ్యాంకు ఏర్పాటు చేయాలి* టీడీపీ ములుగు నియోజకవర్గం ఇంచార్జి దారావత్ దేవా నాయక్ డిమాండ్

నేటిసాక్షి/ములుగు ప్రతినిధి ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారక్క గ్రామమైన మేడారంలో ఏదైనా ప్రభుత్వ బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలి అని టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ దారావత్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం మేడారంలో టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ దారావత్ దేవా నాయక్ మాట్లాడుతూ బ్యాంకు మేడారం ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు అయితే మేడారం చుట్టు ప్రక్కల ఉన్నటువంటి 18 గ్రామాలలోని ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఇప్పుడు బయక్కపేట, కాల్వపల్లి నార్లపూర్ వెంగ్లాపూర్ గోనేపల్లి వాళ్ళు గోవిందరాపేటకు సుమారుగా 30 కిలోమీటర్లు దూరం వెళ్తున్నారు అని కన్నెపల్లి, కొత్తూరు ఊరట్టం, మేడారం వాళ్ళు తాడ్వాయి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మేడారం ప్రాంతం ప్రత్యేక మండలంగా ఏర్పాటు అయితే ఎలాగో బ్యాంకు వస్తుంది కానీ ప్రజల లో అసంతృప్తి రాకముందే బ్యాంకు ఏర్పాటు చేయాలి అని, బ్యాంకు ఏర్పాటు కోసం త్వరలో ములుగు కలెక్టర్ కి తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కి వినతి పత్రం ఇస్తాం అన్నారు మేడారంలో బ్యాంకు ఏర్పాటు చేయాలి అని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మహిళాలు యువత ప్రతి ఒక్కరు స్పందించి ప్రశ్నించి బ్యాంకు సాధించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News