నేటి సాక్షి నారాయణపేట,మార్చి 17, ,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్,ధన్వాడ మండలాల్లోని వివిధ గ్రామాలలో రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ పురస్కరించుకొని మంగళవారం నాడు తోఫా ద్వారా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మరికల్ మండల తాసిల్దార్ రామకోటి, ధన్వాడ మండల తాసిల్దార్ సింధుజ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి, చిట్టెం మాధవరెడ్డి, ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి,మండల ఆర్ ఐ సుధాకర్ రెడ్డి, మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, వీరన్న, మరికల్ యూత్ అధ్యక్షుడు కాటికొండ ఆంజనేయులు, మరికల్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, రాఘవేంద్ర, రామకృష్ణారెడ్డి, గోవర్ధన్, రామకృష్ణ, బొంత మొగులయ్య, ఎల్ రాములు నాగరాజు, కొండ్రంపల్లి గ్రామ సర్పంచ్ సుధాకర్, మండల నాయకులు సుదర్శన్ రెడ్డి, వార్డు సభ్యులు మొగలయ్య జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





