Tuesday, March 17, 2026

*ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం*• ఎం వెంకటేష్ బాబు..

నేటి సాక్షి అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ హిమబిందుకు మెమోరాండం సమర్పించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యారెంటీలను త్వరగా అమలు చేయకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల సతీష్, వంగవీటి శ్రీనివాసరావు, యడ్లపల్లి వెంకట నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News