Tuesday, March 17, 2026

శ్రీశైలం వెళ్ళే కన్నడ భక్తులకు సేవా భావంతో ముందుకు వచ్చి మజ్జిగ పంపిణీ చేసిన దేవ ట్రస్టు ప్రతినిధి నరేష్ ..

నేటి సాక్షి 17 మార్చి ఆత్మకూరు:–ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం కు పాదయాత్రగా వెళ్తున్న కన్నడ భక్తులకు సేవాభావంతో ముందుకొచ్చిన దేవా ట్రస్ట్ (అనంతపురం) వారు గోసాయి కట్ట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆది, సోమవారాల్లో కేవలం రెండు రోజుల్లోనే సుమారు 27 వేల మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు దేవ నరేష్ మాట్లాడుతూ, దాతల సహకారంతో దేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారిగా అటవీశాఖ అధికారుల అనుమతితో ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వచ్చిన ఆలోచనతో, అవసరమైన అనుమతులు పొందుతూ తక్షణమే మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు చెప్పారు.రాబోయే రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా వచ్చే ఉగాది సందర్భంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులకు సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.వేసవి కాలంలో తక్కువ సమయంలోనే ఈ సేవ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన అటవీశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవర నరేష్, భరత్, నాగరాజు, ప్రభాకర్, నరసింహ, లక్మన్,చెంచు బయన్న, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News