నేటి సాక్షి, నారాయణపేట, మార్చి 18, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్లో మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షం ఈదురు గాలులకు మరికల్ గ్రామానికి చెందిన శరత్ అనే రైతు సంబంధించిన మామిడి తోటలో కాయలునేలపాలు కావడం జరిగింది. దాదాపుగా 20, ఎకరాలు మామిడి తోట కలదు. మామిడి తోటకు పైగా ఖర్చు చేయడం జరిగిందని రైతు శరత్ మరికల్ లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షానికి ఈదురు గాలులకు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ధన్వాడ మండల కేంద్రంలో దాదాపు పది ఎకరాలలో మామిడి తోటలో కాయలు అకాల వర్షానికి ఈదురు గాలులకు నష్టం వాటిలిందని వ్యవసాయ రైతు వైద్యనాథ్ లింగం వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని వివిధ సంఘాలు నాయకులు ప్రభుత్వాన్ని. కోరుతున్నారు.





