Wednesday, March 18, 2026

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన బీసీ అంశాలను నెరవేర్చాలని మంచిర్యాల జిల్లాలో లక్ష సంతకాల సేకరణ

నేటి సాక్షి మార్చి 18 (మంచిర్యాల) శ్రీధర్ దమ్మ మంచిర్యాల కార్పొరేషన్ లోని ముల్కల అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ నాయకులు మాట్లాడుతూ *ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు*1 కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధతతో కూడిన మహాత్మ జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని 2 ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని 3 విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూచికత్తులు లేని 10 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని 4 బీసీ ఫెడరేషన్ల కింద కార్పొరేషన్ కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ అలాగే 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని 5 స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఎబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తామని 6 అన్ని జిల్లా కేంద్రాలలో 50 కోట్లతో బీసీ భవనాలు అందులోనే లైబ్రరీ కన్వెన్షన్ హాల్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని 7 ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని 8 ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని 9 జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టి దాదాపు మూడు సంవత్సరాలు దగ్గర పడుతున్న ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదు ఎన్నికల సందర్భంగా బీసీల ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లు దండుకోవడానికి మాత్రమే బిసి అంశాలను మేనిఫెస్టోలో పెట్టిందని భావిస్తున్నా బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను సాధించుకునే దిశగా మా ఉద్యమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకటయ్య, శాఖపూరి భీమ్సేన్, వేముల అశోక్,కీర్తి రవి, రామగిరి రాజన్న చారి, ధర్మాజీ సాయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News