Wednesday, March 18, 2026

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య.

నేటి సాక్షి 18 మార్చి నందికొట్కూరు:-దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రవేశపెట్టిన “దివ్యాంగ శక్తి పథకం” ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రారంభించడం ఆనందదాయకం ఎమ్మెల్యే గిత్తనేడు నందికొట్కూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నందు నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య దివ్యాంగ శక్తి పథకం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం దివ్యాంగ సోదర సోదరీమణులతో కలిసి నందికొట్కూరు నుంచి కర్నూల్ వరకు బస్సులో ప్రయాణించడం ఎంతో సంతృప్తినిచ్చింది అన్నారు.సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: దివ్యాంగ శక్తి ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ప్రయాణంలో సౌలభ్యం కలిగించడంతో పాటు, వారి ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది, దివ్యాంగుల జీవితాల్లో మరింత సౌకర్యం, స్వావలంబన పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా కూటమి ప్రభుత్వం ద్వారా కొనసాగిస్తామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అన్నారు ఈ కార్యక్రమంలో: టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, సంగినేల రమణ, జిల్లా ఉపాధక్షురాలు ప్రసన్న లక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు మీనాక్షిదేవి, DR వనజ, అనురాధ, కూటమి నాయకులు మండల నాయకులు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News