నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి మార్చ్ 19 కాగజ్‌నగర్‌లోని సిర్సిల్క్ ఎఫ్ కాలనీలో ఈ నెల 19వ తేదీన జూనియర్.యువకుల బాలురు మరియు బాలికల కోసం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ ఎంపికల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 22, 23, 24 తేదీలలో హైదరాబాద్‌లోని షైఖ్పేట్లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించబడుతుంది.వివరాలువేదిక: కాగజ్‌నగర్, సిర్సిల్క్ ఎఫ్ కాలనీరిపోర్టింగ్ సమయం: ఉదయం 8:00 గంటలకువయస్సు పరిమితి (జనన సంవత్సరం ఆధారంగా):అండర్-17 బాలురు / బాలికలు: 2010-11అండర్-19 బాలురు / బాలికలు: 2008-09అర్హత కలిగిన అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు:ఆధార్ కార్డుజనన తేదీ ధృవపత్రం2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు(అసలు మరియు జిరాక్స్ ప్రతులు తప్పనిసరి)ఈ కార్యక్రమాన్ని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.నిర్వాహకులుఅధ్యక్షుడు: వి. మధుచైర్మన్: శివ నాయర్ప్రధాన కార్యదర్శి: ఎం. శేఖర్మరిన్ని వివరాలకు: ఫోన్ నెంబర్ 9177112942యువ బాక్సర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.





