నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 19 అకాల వర్షంతో మండలంలో పలు వాణిజ్య పంటలు నేలకొరిగాయి అంతేకాకుండా పలుచోట్ల విద్యుత్ సమస్య నెలకొని ఉంది, బుధవారం రాత్రి మండల వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడింది దీంతో 29 చింతమాకులపల్లి పంచాయతీ ఖాన్‌సాబ్ మి ట్టకు చెందిన, నూరుల్లా ఎకరా స్థలంలో వేసిన వేల తోట కుప్పకూలింది, మార్కెట్లో ధర ఎక్కువ ఉండడంతో రైతు చేసిన అప్పులు తీర్చుకోవాలని బీ రపంట సాగు చేశాడు తీరా చూసి చేతికందే సమయంలో అకాల వర్షం తన కొంప ముంచిందని నూరుల్లా వాపోయాడు అదేవిధంగా చౌడేపల్లి పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరకడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం వాటిల్లింది ,దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఒకవైపు దోమల మోత మరోవైపు కరెంటు కోతతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పట్టణ ప్రజలు అన్నారు, అకాల వర్షం మామిడి రైతులకు సైతం నష్టాన్ని మిగిల్చింది ఇప్పుడిప్పుడే వస్తున్న మామిడి పిందే నేలరాలాయి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు





