Thursday, March 19, 2026

*బలహీనతలను అధిగమించి విజయం వైపు అడుగులు వేయాలి..**ఎస్ కె ఎన్ ఆర్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………..ఈ తెలుగు సంవత్సరాది పరాభవ నామ సంవత్సరంలో మన లోని బలహీనతలను అధిగమించి విజయం వైపు అడుగులు వేయాలని వాకర్స్ ఆకాక్షించారు.ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం ఎస్ కె ఎన్ ఆర్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు..వక్తలు ఉగాది పండుగ విశిష్టతను వివరిస్తూ కొత్త ఆశలతో జీవించాలని, నేటి కాలంలో ఉమ్మడి కుటుంబ ఆవశ్యకతను , అన్యోనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. సుమారు 200 మంది పాల్గొన్న వాకర్ లు కొత్త సంవత్సరంలో ఇంకా ఆరోగ్యం వైపు అడుగులు వేస్తూ నూతన ఉత్తేజంతో జీవనం కొనసాగిస్తామని ఉద్ఘాటించారు..అనంతరం ఉగాది పచ్చడి ఆరగించి, బూరెలు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అరిగేల అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్, వాకర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గుండా సురేష్, సాగి శ్రీధర్ రావు, ఎర్ర నర్సయ్య, అంబారీ శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, కౌన్సిలర్ లు రాజేష్, ధర్మరాజు, గంగాధర్, శంకర్, భూమయ్య, చల్ల లక్ష్మారెడ్డి, పురుషోత్తం రెడ్డి , బైరం హరికిరణ్, శ్రీధర్ రావు, పరంధాములు, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News