నేటి సాక్షి వికారాబాద్ :2026-2027 బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సార పోసినట్లు ఉంది. అన్ని వర్గాలను దగా చేసి, నయవంచన చేసిన బడ్జెట్. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలను నట్టేట ముంచిన బడ్జెట్. కేసీఆర్ ఎప్పుడో చెప్పారు,తప్పిదారి కాంగ్రెస్కు ఓటు వేస్తే రైతుబంధుకు రామ్ రామ్, దళిత బందుకు జై భీమ్ అని. ఆ మాటలను రేవంత్ సర్కార్ నిజం చేస్తుంది. కౌలు రైతుల ఊసు లేదు ఆటో వాళ్లకు, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగింది. మహిళలకు, విద్యార్థినులకు అవమానం జరిగింది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు దగా జరిగింది. ఏదైనా ఎలక్షన్ ఈ మధ్యలో వచ్చి దాని ఫలితాలతో రేవంత్ సర్కార్ కూలిపోతది అని ఉంటే ప్రజలందరూ పరిగెత్తుకొచ్చి రేవంత్ సర్కార్ను కూల కొట్టేవారు. కానీ కెసిఆర్ చెప్పినట్లు కాంగ్రెస్కు ఓటు వేస్తే మోసపోతము, గోసపడుతాము అన్న మాటలు నిజమవుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలుసు కానీ,రేవంత్ సర్కారు ఏ పని చేసినా భూముల చుట్టూ తిరుగుతుంది. రియల్ ఎస్టేట్ దందా మాత్రమే గుర్తుకొస్తుంది. ఐదు బడ్జెట్లలో మూడు బడ్జెట్లు ఈరోజుతో పూర్తయినవి. మిగిలినవి రెండు మాత్రమే. కానీ వీళ్ళిచ్చిన హామీలలో ఏ ఒక్క హాని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. ప్రజలందరూ అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా సమాధి చేయటం ఖాయం.





