Friday, March 20, 2026

*రోడ్డు విస్తరణ పనులు సాగేనా**మంత్రి ఆదేశాలు వట్టిమాటలేనా* *ఇబ్బంది పడుతున్న జనాలు, వాహన దారులు*మంచిర్యాల జిల్లా,, మర్చి 20,

నేటి సాక్షి చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి చెరువు కట్ట వరకు గల రోడ్డు ఇరుకుగా ఉండడంతో పట్టణ ప్రజలు ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులకు పడుతున్నరు ఈ రహదారి గుండా కోటపల్లి, వేమనపల్లి మండలాలకు ఆర్టీసీ బస్సులు, ప్రవేట్ వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తూ ఉంటాయి. ఈ రెండు మండలాలకు చెందిన ప్రజలు తమ అవసరాల నిమిత్తం రోజు వస్తూ పోతు రాకపోకలు కొనసాగిస్తుంటారు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో మరోపక్క వాహనాల రద్దీ పెరగడం ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో ప్రజలు మరియు వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది . రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయడంతో పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి రోడ్డు విస్తరణ పనులు త్వరలో చేపట్టి ప్రజలకు సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదు. గత నాలుగు నెలల క్రితం మున్సిపల్ అధికారులు ఎంతో హడావుడి సృష్టించి దుకాణ సముదాయాల ముందు ఉన్న తాత్కాలిక షెడ్లను తొలగించి రోడ్లు కొలతలు చేసి మార్కింగ్ కూడా చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తిరిగి ఎటువంటి పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు ఆవేదన గురయ్యారు చెన్నూరు పట్టణం వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డు విస్తరణ పనులు తప్పనిసరి కాని స్థానిక నాయకులు అధికారులు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహించడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News