Friday, March 20, 2026

యువ చైతన్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.

నేటి సాక్షి వికారాబాద్ / బంటారం:వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం రోమ్ పల్లి గ్రామంలో యువ చైతన్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో యువ చైతన్యం ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు చైతన్య కిరణ్ ఘనంగా ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమం బంట్వారం మండల మాజీ ఎంపీపీ డాక్టర్ ఎం. రామచంద్రరావు గారి సహకారంతో జరిగింది.ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులు హాజరై, ఇతర మతాలకు చెందిన ప్రజలతో కలిసి గంగా–జమునా తేజీ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సోదరభావంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక ఐక్యత, సౌహార్ద వాతావరణం మరింత బలపడింది.రాంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ , ఉపసర్పంచ్ నరేష్ , స్థానిక సీనియర్ నాయకులు శ్రీశైలం, కృష్ణ, మల్లప్ప, నరసింహులు, శ్రీనివాస్ రెడ్డి, కాంత్ రెడ్డి, యూసుఫ్, ఫెరోజ్, షానవాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News