నేటి సాక్షి , మార్చు 21,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని, ధన్వాడ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ముస్లిం సోదరులు శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు గత నెల రోజులుగా ఉపవాసాలు నిర్వహించి శనివారం నాడు ఆయా గ్రామాలలోని ఈద్గాల వద్ద నమాజు లను నిర్వహించడం జరిగింది. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గాల వద్ద అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి,జిల్లా నాయకులు ఎస్.సూర్య మోహన్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెన్నయ్య ఉపసర్పంచ్ కటిక కాజా, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలగొంది వీరన్న, మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కాటేకొండ ఆంజనేయులు, టైసన్ రాఘవేంద్ర గోవర్ధన్, పెంట మీద రాఘవేంద్ర,నాయకులు రామకృష్ణారెడ్డి, నాగరాజు, లంబడి రాములు, బొంత మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.





