నేటి సాక్షి,నారాయణపేట, మార్చి 21 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), రంజాన్ పండుగను పురస్కరించుకొని పేట జిల్లాలోని, మక్తల్ నియోజకవర్గం లోని వివిధ వివిధ మండలాల్లోని గ్రామాలకు చెందిన ముస్లిం సోదర సోదరీమణులకు శనివారం రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, యువజనుల సర్వీసుల, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు లో ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను అలింగనం చేసుకొని వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





