*నేటిసాక్షి,నల్లబెల్లి* ఫామ్ ఆయిల్ సాగుకు రైతులకు అవగాహన కల్పించేందుకు ఆయిల్ ఫామ్ సాగుపై క్షేత్ర ప్రదర్శనకు మండల రైతులను సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామంలోని ఆయిల్ ఫామ్ సాగు తో పాటు పామాయిల్ గింజల నుండి ఇంధనాన్ని తీసే కర్మాగారాన్ని సైతం సందర్శించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖ ద్వారా చేపట్టింది. నర్మెట గ్రామంలోని పామాయిల్ పంట సాగుపై రైతులకు ఆర్థిక స్వాలంబన తోపాటు సాగు శ్రమ తగ్గింపు పై అవగాహన కల్పించారు.నల్లబెల్లి మండలం నుండి నల్లబెల్లి మండల కేంద్రం, కొండాయలపల్లి,శనిగరం, ముచింపుల రేలకుంట నందిగామ మేడపల్లి రామతీర్థంగ్రామాల రైతులు సుమారు 250 మంది ఈ క్షేత్ర ప్రదర్శనకు శనివారం బయలుదేరారు.వీరి వెంట వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇన్చార్జి సీఈవో ఎల్లన్న తదితరులు ఉన్నారు..





