వేంపెంట గ్రామానికి చెందిన టిడిపి మండల బిసి సెల్ అధ్యక్షుడు-కంభం.మోహన్ గౌడ్ భార్య బ్రెయిన్ స్ట్రోక్ తో సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకొని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, నాయకులతో కలిసి వెలుగోడు పట్టణంలో ఉన్న వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది.కంభం మోహన్ గౌడ్ కుటుంబానికి ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడాలని, మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మీరు ధైర్యంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాష, పాములపాడు ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార పరపతి సంఘం చైర్మన్ సి.గోవిందు, నాయకులు ఎర్రగూడూరు హరినాధ రెడ్డి, శివ శంకర్ స్వామి, రుద్రవరం సురేష్, ఇస్కాల లింగస్వామి, మల్లీశ్వరరెడ్డి, ఆంజనేయులు, సంపత్, పుల్లన్న, శంకర్, పిఏ-మద్దిలేటి, సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్, వేంపెంట నెమలి రమణారెడ్డి, ఆదిరెడ్డి గంటా.రమేష్ అప్పరాల చంద్రశేఖర్ గౌడ్, శంకరాముల నాయక్, లెనిన్ బాబు, మల్లేష్ నాయుడు, జి.నాగేంద్ర, జనార్దన్ గౌడ్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.





