Sunday, March 22, 2026

*స్వర్ణ పదవిపై సర్పంచుల హర్షం** పీఎస్ఆర్ నివాసంలో శుభాకాంక్షల వెల్లువ*

నేటి సాక్షి, ఎండపల్లి:* తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా వరంగల్ మాజీ మేయర్, సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇటీవల నియమితులై గాంధీభవన్‌లో పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆదివారం ఎండపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచులు హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు (పీఎస్ఆర్) నివాసంలో వారితో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వర్ణకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె స్వయాన పొనుగోటి శ్రీనివాసరావు సోదరి కావడం విశేషం. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. తమ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డకు ఇలాంటి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, పార్టీలో మహిళల నాయకత్వానికి ఇది మరింత బలం చేకూర్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, రాజారాంపల్లి సర్పంచ్ సంగ రమేష్, గుల్లకోట సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్, అంబారీపేట సర్పంచ్ దర్శనాల నరేష్, కొత్తపేట సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి, పడకల్ సర్పంచ్ బెడ్డెల ప్రవీణ్, శానబండ సర్పంచ్ గాధం భాస్కర్, సూరారం సర్పంచ్ కొమ్ము కొమురమ్మ–శ్రీనివాస్ తదితరులు పాల్గొని స్వర్ణకు అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మహిళల సాధికారత, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News