నేటి సాక్షి, నారాయణపేట. మార్చి 23, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని నారాయణపేట వెళ్లే రహదారిలో గల ప్రభుత్వ స్థలం తోళ్ల బండను గతంలో కొందరు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం పై నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు తోళ్ల బండను సర్వే సర్వే నెంబర్ 212 లో సర్వే చేయడం జరిగింది. వచ్చిన ఆరోపణలపై మరికల్ మండల తాసిల్దార్ రామకోటి, మరికల్ మండల రెవెన్యూ అధికారులు సోమవారం నాడు తోలబండపై మరికల్ జిపిఓ అధికారి వెంకటప్ప ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది శ్రీనివాసులు, రఘు ల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును తోలబండపై ఏర్పాటు చేయడం జరిగింది.





