Thursday, March 26, 2026

విద్యార్థులే రేపటి తరం భవిష్యత్తు

పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య

నేటిసాక్షి/ములుగు జిల్లా స్థాపర్

విద్యార్థుల ఆరోగ్యం చదువు సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం 2026 27 విద్యా సంవత్సరం నుంచి రెండు ముఖ్యమైన పోషకాహార పథకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుందనీ పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త గా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండు గొప్ప పథకాలు ప్రవేశ పెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ
ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు “బ్రేక్‌ఫాస్ట్ పథకం”, అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు “మధ్యాహ్న భోజన పథకం”ను విస్తరించనుంది.
బ్రేక్‌ఫాస్ట్ పథకం
రోజుకు శక్తివంతమైన ప్రారంభం
ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ప్రతిరోజూ అల్పాహారం అందించబడుతుంది. వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ చర్యతో పాఠశాలకు ఖాళీ కడుపుతో వచ్చే పిల్లల సంఖ్య తగ్గి, వారి దృష్టి చదువుపై కేంద్రీకృతమవుతుందని అన్నారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ఇప్పటివరకు పాఠశాల స్థాయిలో మాత్రమే ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల వరకు విస్తరించనున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కువ సమయం కాలేజీల్లో గడుపుతుండటంతో, వారికి సమయానికి పోషకాహారం అందించడం ద్వారా చదువు సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది విద్యార్థులు ఆకలితో తరగతుల్లో ఉండకుండా చూడటం
పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం
పోషకాహార లోపం నివారించడం
చదువుపై దృష్టి పెంపొందించడం
డ్రాప్‌ అవుట్ రేటును తగ్గించడం ప్రభుత్వ ద్యేయం అని పంచాయతీ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News