నేటి సాక్షి వికారాబాద్ :కొడంగల్ కు దీటుగా వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని, ఈ ప్రాంత అభివృద్ధి నా కర్తవమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య ఆద్వర్యంలో మంగళవారం జరిగిన పురపాలక సంఘం వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎక్స్ అఫిషియో హోదాలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.ఈసందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో ప్రజల ఆదరణ, అభిమానంతో విజయం సాధించి బాధ్యతలు స్వీకరించిన పాలక కార్యవర్గానికి ముందుగా ఆయన అభినందనలు తెలిపారు.బడ్జెట్ విషయాలపై అవగాహన కోసం త్వరలోనే ప్రొఫెషనల్స్ తో పాలకారగానికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయిస్తానన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను మంత్రి గా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రి, స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి తో మాట్లాడి రూ. 2,300 కోట్లతో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ ప్రాజెక్టు మంజూరు చేయించానని, దేశంలో మొత్తం ఏడు శాటిలైట్ ప్రాజెక్టులు మంజూరు అయితే అందులో వికారాబాద్ ఒకటని, దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారడంతో ఆ నిధులలో మెజారిటీ రాలేవన్నారు.ఇప్పుడు రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కొడంగల్ కు దీటుగా వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని అని తెలిపారు.మున్సిపాలిటీ లో విలీనమైన గ్రామాలలో అవసరమైన ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయిస్తా అన్నారు.పట్టణం పరిధిలో అవసరమైన మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జి లను మంజూరు చేయించడానికి రైల్వే శాఖతో ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన తెలిపారు.ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తా అన్నారు.మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి నిర్మించిన శివసాగర్ చెరువును పూర్తిగా ఆధునికీకరణ చేయిస్తానని, హైదరాబాద్లలోని ఎన్టీఆర్ పార్కు తరహాలో ఇక్కడ కూడా పార్కును ఏర్పాటు చేయిస్తా అని ఆయన హామీ ఇచ్చారు.నిధులు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది, సక్రమంగా అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి అని ఆయన పాలకవర్గానికి సూచించారు.వైఎస్ రాజశేఖరరెడ్డి మన వికారాబాద్ ప్రాంతానికి సాగునీరు తీసుకు రావడానికి ప్రాణహిత- చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి పథకాలను తీసుకురావాలని ప్రయత్నం చేశారని గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసి మన ప్రాంతానికి అన్యాయం చేసిందనారు.పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మన ప్రాంతానికి తీసుకురావాలని మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నానని, ఈ పథకం పూర్తయితే మన వికారాబాద్ పట్టణానికి త్రాగునీటితో పాటుగా నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులు తొలుగుతాయన్నారు.TUFIDC 60 కోట్ల నిధులు మంజూరు అయ్యాని, HMDA నిధులు 270 కోట్లు త్వరలోనే మంజూరు అవుతాయన్నారు.అనంతగిరిని వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థతో ఒప్పందం కుదిరిందని,ఈ ప్రాజెక్టు పూర్తయితే మన ప్రాంతంలోని మూడు వేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు పట్టణ పరిధిలోని నారాయణపూర్ లో వంద ఎకరాలలో టెక్స్ట్ టైల్స్ పార్కు అభివృద్ధి చేసి నాలుగు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేశాను. గత ప్రభుత్వం పదేళ్ళు పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాను ఆయన తెలిపారు.పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు.చేయిస్తానన్నారు.ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో అందరూ మనవాళ్ళే, అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు.ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పనిచేసి నిధులను సక్రమంగా, సమర్ధవంతంగా ఖర్చు చేసి వికారాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి, నా వంతుగా మీకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.నేను అందరు రాజకీయ నాయకుల లాంటి వ్యక్తిని కాదు, నాకు ఆదాయం, ఆస్థులపై ఆశ లేదని,వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి నా లక్ష్యం, మర్రి చెన్నారెడ్డి లాగా ఈ ప్రాంతం అభివృద్ధి పై నా ముద్ర ఉండాలని నా కోరిక అన్నారు.చిన్న వయసులోనే చైర్మన్ అయిన నా కూతురు గడ్డం అనన్య పై మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరారు.అనంతరము చైర్ పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ వార్డుల సభ్యులు చెప్పిన సమస్యలను అన్నింటినీ నేను వ్యక్తిగతంగా నోట్ చేసుకుంటున్నానని,ప్రతి వార్డులో పర్యటించి కామన్ ప్రాబ్లమ్స్ ను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేద్దా మన్నారు.మీ వార్డులలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బంది గురించి అవగాహన కలిగి ఉండాలి. తద్వారా ఇబ్బందులు తలెత్తిన సమయంలో వెంటనే సంబంధిత ఉద్యోగిని అప్రోచ్ కావడానికి వీలవుతుందన్నారు.స్పీకర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అధికంగా నిధులను తీసుకుని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.వికారాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఉమా శంకర్, కమీషనర్ విక్రం సింహా రెడ్డి, వార్డు కౌన్సిలర్స్ , అధికారులు పాల్గొన్నారు.





