Tuesday, March 31, 2026

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలోమహాలక్ష్మి పథకం ద్వారా పదివేల కోట్ల లబ్ది పొందారు.

నేటి సాక్షి వికారాబాద్ : మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పదివేల కోట్ల రూపాయలు లబ్ది పొందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆద్వర్యంలో వికారాబాద్ బస్టాండ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, AMC చైర్మన్ చేపల శ్రీనివాస్ ముదిరాజ్, RTI మెంబర్ జాఫర్, డిపో మేనేజర్ నమ్రత, ప్రయాణికులు.● ఈసందర్భంగామహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ RTC బస్సులలో నిరంతరం ప్రయాణిస్తున్న లాయల్ ప్యాసింజర్ లకు బహుమతులు అందజేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు, మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో మెజారిటీ అమలు చేస్తున్నాం.గత ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆర్ధిక విద్వంసం చేసింది.అయినప్పటికీ రేవంత్ రెడ్డి సమర్ధుడు కాబట్టి ఉచిత ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఇస్తున్నారుఅదేవిధంగా స్వంత ఇళ్ళు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు అవుతున్నాయి.రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది.కానీ గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్ధిక సహాయం, స్కూటీ, తులం బంగారం ఇవ్వలేక పోతున్నాం. ఆర్ధిక పరిస్థితులు మెరుగైన తరువాత త్వరలోనే ఈ హామీలను కూడా అమలు చేస్తాం.ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళలకు పథకాలను అమలు చేస్తుంది.మహిళలకు అన్ని విధాలుగా భరోసా ఇస్తున్న ప్రజా ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News