నేటి సాక్షి మార్చి 31 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పూలె భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ* హాజరై మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న విధానం వల్ల ప్రపంచ శాంతికి విగాథం కలిగిస్తుంది.అమెరికా తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి తమ దగ్గర ఉన్న ఆయుధాల నిలువలను అమ్ముకోవడానికి అన్ని దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి పెత్తనం చేస్తుంది.యుద్దాలను సృష్టించడం కోసం వెనిజులా, ఇరాన్,క్యూబా తమకు గిట్టని దేశాలపై కవ్వింపు సైనిక చర్యలు చేస్తూ ప్రపంచంలోని అన్నిదేశాల పైనతమ పెత్తనం కొనసాగిస్తూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలన్నిటిని ఉల్లంఘించి ఏకదృవ ప్రపంచం సాధించడం కోసం అమెరికా తప్పుడు పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుంది.యుద్దాలను తన వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తుంది.ట్రంపు తమ మాట వినని దేశాలపై విచ్చలవిడిగా పన్నుల శాతాన్ని పెంచి వేస్తుంది.దీనివల్ల అన్ని రకాల వస్తువులపై అధిక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి భారతదేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి గురవుతున్నారు. అక్కడ ఎక్కడో యుద్ధం జరిగితే మన ఇండ్లలో సరుకుల ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఎగుమతులు దిగుమతుల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.యుద్ధం వల్ల ఎవరికి లాభంలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంపు తప్పుడు విధానాల వల్ల మన దేశ సాధారణ ప్రజలు పేద ప్రజల జీవితాలు చితికి పోతున్నాయి.భారతదేశ పాలకులు స్వతంత్ర విధానం తీసుకోవాలి.అమెరికా ట్రంప్ ఒత్తిళ్లకు తలగొద్దు.మన ప్రజలపైభారాలుపడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.ఉపాధి ఉద్యోగాలను కాపాడాలన్నారు. * రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీ, ఆశ ఉద్యోగ కార్మికులు వేతనాలు పెంపు విషయమై చలో హైదరాబాద్ ధర్నాకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా పోలీసులు చేత నాయకులపై కార్యకర్తలపై దాడి చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. ఈ దాడిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదే విదంగా గ్రామపంచాయతీ, మున్సిపల్, ఐకేపీ వివోఏలు, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు చేస్తున్న ఆందోళన పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పోరాటాల పైన స్పందించి, తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. *సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్* మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల జిల్లా అభివృద్ధికి, కాలేశ్వరం ముంపు సమస్యకు,పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎన్ని నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించారో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ,మంత్రులు చెప్పాలన్నారు. అదేవిధంగా పోడు చేసుకుంటున్న ఆదివాసి గిరిజన పేదలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా, ఆదివాసి పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అటవీశాఖ అధికారులు ఇబ్బందుల గురిచేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి నీరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు,పెన్షన్స్ ఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో పైల్ల ఆశయ్య సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, సంకె రవి జిల్లా కార్యదర్శి,కె,అశోక్,ఎ.పున్నం, బోడంకి చందు,జి. ప్రకాష్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు , ఉమారాణి, మల్లేశ్వరి,లింగన్న, రంజిత్ కుమార్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, రాజారాం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




