Wednesday, April 1, 2026

*హనుమాన్ జయత్సవం సందర్భంగా అన్నప్రసాద విస్తరణ*——-• బాలాజీ రోడ్ రాంనగర్‌లో భక్తులకు ఆహ్వానం• శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు—–*

నేటి సాక్షి – కోరుట్ల ( రాధారపు నర్సయ్య )*కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్ రాంనగర్ ప్రాంతంలో గురువారం (02-04-2026) హనుమాన్ జయత్సవం సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో అన్నప్రసాద విస్తరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్ తెలిపారు.*భక్తులకు ఆహ్వానం*హనుమాన్ జయత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.*విశేష ఏర్పాట్లు*భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాద విస్తరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు స్వచ్ఛంద సేవకులను కూడా నియమించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా 22వ వార్డు మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్ మాట్లాడుతూ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.____________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News