Wednesday, April 1, 2026

సర్పంచుల ఘన సన్మానం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఉత్సాహభరిత కార్యక్రమం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఏప్రిల్. 1 చౌడేపల్లి మండలంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులుగా ఎన్నికై సేవలందించిన సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించారు. సర్పంచుల పదవీకాలం ముగియనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు జి. నాగభూషణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి సర్పంచును శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి వారి సేవలను ప్రశంసించారు. సన్మానం పొందిన సర్పంచులు మాట్లాడుతూ, పదవి కాలం ముగిసినా ప్రజాసేవ పట్ల తమ నిబద్ధత యథాతథంగా కొనసాగుతుందని, ప్రజల పక్షాన నిలబడి పార్టీ అండదండలతో ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.మాజీ మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలు, సలహాలు తమకు మార్గదర్శకంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఆయన అండదండలతో నియోజకవర్గం నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని, పదవి కంటే సేవ ముఖ్యమని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News