నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 1, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్) నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం విద్యార్థులు కిషన్, మోహన్, హర్ష వర్ధన్ జాతీయస్థాయి నెట్ వాల్ పోటీలో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉత్తర ప్రదేశ్‌లో మార్చి 29 నుండి 31, 2026 వరకు నిర్వహించిన 4వ జూనియర్ నేషనల్ మిక్స్‌డ్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్లో రజత పతకం (సిల్వర్ మెడల్) సాధించడం ఎంతో గర్వకారణం.వారి కృషి, పట్టుదల మరియు జట్టు భావనకు ఇది నిదర్శనం. ఈ విజయంతో తమ సంస్థకు, జిల్లాకు మరియు రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగాడా. ఎస్. రమేష్, అధ్యక్షుడుడా. ఎం. రామ్ మోహన్ గౌడ్, కార్యదర్శిఎం. రాజారం, సీనియర్ ఉపాధ్యక్షుడులక్ష్మణ్, ఉపాధ్యక్షుడుపీఈటీ అంజనేయులు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. వారికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.





