నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 1,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం బాలాజీ గోల్డ్ మరియు సిల్వర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారి సౌజన్యంతో దూర ప్రాంతాల నుండి పాఠశాల వచ్చే బీద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ గోల్డ్ మరియు సిల్వర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండిసాకేత్ బట్టడ్ మరియు ఫాస్ట్ గవర్నర్ లైన్ హరి నారాయణ బట్టడ్ మాట్లాడుతూ విద్యార్థులు చాలా చక్కగా చదువుకొని విద్యార్థులు ఉన్నత స్థానంలో చేరుకోవాలని గ్రామానికి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీదవారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలియజేశారు ఈ పంపిణీలో వివిధ పాఠశాలల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ కు 10సైకిళ్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరగిద్దకు 10 సైకిళ్లు ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాలక నారాయణపేటకు 10 సైకిళ్లు ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాల నారాయణపేటకు 10 సైకిలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ సరిత బట్టడ్ సెక్రెటరీ సాయినాథ్ మరియు లైన్ సభ్యులు జనార్దన్ రెడ్డి సాయినాథ్ సురేందర్ కృష్ణమూర్తి బాలాజీ రవి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరగిద్ద ప్రధానోపాధ్యాయులు సురేష్ మరియు తిప్పన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ఉపాధ్యాయులు భాను ప్రకాష్ లక్ష్మణ్ మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





