నేటి సాక్షి ఏప్రిల్ 1 మంచిర్యాల) శ్రీధర్ దమ్మ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ లోని ఫర్జానా బేగం గారు మరియు రుబీనా నహీద్ గారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఇందిరమ్మ ఇల్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే గారి సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు..ఈ సందర్భంగా సురేఖమ్మ గారిని శాలువాతో సన్మానించారు..అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చినందుకు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..





