నేటి సాక్షి గజ్వేల్ : గజ్వేల్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కిరణ్ సాగర్ రావు, ఉపాధ్యక్షుడిగా నరేష్ చారి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ పరిధిలోని న్యాయవాదుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే బార్ అసోసియేషన్‌కు సంబంధించిన అసంపూర్తి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.న్యాయవాదులకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, బార్ అసోసియేషన్ అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారిగా ప్రశాంత్ కుమార్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గోపాలరావు, పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి, వి. శ్రీనివాస్, పార్థసారథి, వనం భాస్కర్, బాల ముకుంద రెడ్డి, పెండం శ్రీనివాస్, అబ్దుల్ గఫార్, భాగయ్య, సమీర్, రామకృష్ణతో ఎన్నెల్లి స్వామి లతో పాటు పలువురు బార్ సభ్యులు పాల్గొన్నారు.





