Sunday, April 5, 2026

వయోవృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సీనియర్ సిటిజన్స్ డిమాండ్…

నేటి సాక్షి ఏప్రిల్ 4 (మంచిర్యాల) శ్రీధర్ దమ్మతెలంగాణ రాష్ట్రంలో వయోవృద్ధులకు గతంలో అమల్లో ఉన్నట్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ రాయితీలను తిరిగి కల్పించాలని సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం సమావేశంలో తీర్మానం చేశారు.సమావేశంలో పాల్గొన్న వయోవృద్ధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు 10 వేల కోట్ల వరకు భారీగా ఆర్థిక భారం తగ్గిందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన సంబరాలు దీనికి నిదర్శనమని తెలిపారు.అయితే, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లే వయోవృద్ధుల పట్ల కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గతంలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ రాయితీలు ఉండేవని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడం వల్ల వయోవృద్ధులు చనా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.“మేము రాష్ట్రంలోని వయోవృద్ధులం… మేమేమి పాపం చేశామని గతంలో ఉన్న రాయితీలను ఇప్పుడు ఎందుకు నిలిపివేశారు?” అని సమావేశంలో ప్రశ్నించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వయోవృద్ధులు కూడా కీలకంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వయోవృద్ధుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వయోవృద్ధులకు బస్సు ప్రయాణంలో రాయితీలు అమల్లో ఉన్నాయని, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు.అలాగే సింగరేణి విశ్రాంత ఉద్యోగులతో సహా రాష్ట్రంలోని వయోవృద్ధులందరికి ఈ సౌకర్యం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూనే, వయోవృద్ధుల పట్ల కూడా ప్రభుత్వం సమాన దృష్టి తో చూడాలని కోరినారు.ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు జెట్టి మురహరి, కార్యదర్శి ఆర్. రాజన్నతో పాటు వయోవృద్ధుల సంఘం నాయకులు ఆది రాజయ్య, మాదరబోయిన మల్లేష్, గుజ్జ శంకర్, ముత్యాల రాయమల్లు, గుజ్జ మల్లేష్, సల్లూరు గణపతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వయోవృద్ధుల ఐక్యత వర్ధిల్లాలని, టీజీ ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు వెంటనే కల్పించాలని నినాదాలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News