Sunday, April 5, 2026

క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై స్పందించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

నేటిసాక్షి ఏప్రిల్ 4 (మంచిర్యాల) శ్రీధర్ దమ్మ *వివేక్ సర్ కామెంట్స్*ఖబడ్దార్ బాల్క సుమన్ చెన్నూరులో హింసను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం.సుమన్ వ్యవహారా శైలిలో ఎలాంటి మార్పు లేదు.అందుకే చెన్నూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారుపాత సుమన్ లా మళ్లీ అదే రీతిలో వ్యవహరిస్తే చెన్నూరు ప్రజలు ఊరుకోరు..మళ్ళీ తగిన గుణపాఠం చెప్తారు.గత ఎన్నికల్లో బట్టలిప్పి కొడతానని వ్యాఖ్యలు చేసినందుకే చెన్నూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.ప్రజాసౌమ్య పద్ధతి లో ఎన్నికలకు కట్టుబడి ఉన్నామనేదానికి నిదర్శనం ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు.మొదటి నుంచి మేము ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాం. కానీ బాల్క సుమన్ బీఆర్ఎస్ లీడర్లు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బదనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మా కాన్వాయ్ పై దాడి చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చెన్నూరు నియోజకవర్గం లో ఈసారి ఎన్నికలు జరిగాయి. కానీ టిఆర్ఎస్ హయాంలో బెదిరించి ఏకగ్రీవాలు చేసి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నా చరిత్ర బాల్క సుమన్ ది. బాల్క సుమన్ల బెదిరింపు, రౌడీ రాజకీయాలు మేము చేయలేదు చేయబోము. అలా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు.క్యాతన పల్లి మున్సిపాలిటీని, చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. ఎన్నికైన చైర్మన్,వైస్ చైర్మన్ కి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News