Saturday, April 4, 2026

హెడ్లైన్ : కౌతాళం జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా క్రీడా, సాంస్కృతిక వారోత్సవాలు

నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 04 కౌతాళం టౌన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడా మరియు సాంస్కృతిక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా కౌతాళం సొసైటీ చైర్మన్ అల్లూరి వెంకటపతి రాజు, టిడిపి కౌతాళం టౌన్ అధ్యక్షులు డాక్టర్ నీలి రాజనంద్, స్కూల్ కమిటీ చైర్మన్ బసవరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడటంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచేందుకు ప్రోత్సాహం కల్పిస్తాయని తెలిపారు. అలాగే ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడంలో ఈ ఉత్సవాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విజేతలకు మెమెంటోలు, బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ముఖ్య అతిథులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News