నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ (ఎండి ముబీన్)తిర్యాణి మండలంలోని పిట్టగూడ గ్రామానికి చెందిన హన్మంతరావ్ హత్య కేసులో పరారైన నిందితుడు రాయిసిడం వినోద్ కుమార్ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రెబ్బెన సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ వెల్లడించారు.హన్మంతరావ్ మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో వినోద్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని భావించినట్లు తెలిపారు. ఈ వివాదంపై గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి శాంతి పాటించాలని సూచించినప్పటికీ సమస్య కొనసాగినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో 01 నవంబర్ 2025న, పొలంలో పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న హన్మంతరావ్పై వినోద్ కుమార్ తన ఇంటి ముందు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు. దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలు ఏర్పడగా, సంఘటన సమయంలో అక్కడ ఉన్న ఆయన భార్యను కూడా బెదిరించినట్లు తెలిపారు.హత్య అనంతరం బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో నిందితుడు తప్పించుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మరో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.నిందితుడు పరారీలో ఉండటంతో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిరంతర నిఘా మధ్య 07 ఏప్రిల్ 2026న గోలేటి ఎక్స్ రోడ్ ఆటో స్టాండ్ వద్ద నిందితుడిని మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.అనంతరం నిందితుడిపై విచారణ పూర్తి చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.పోలీసు సిబ్బందికి అభినందనలునిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ, తిర్యాణి ఎస్సై వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, విద్యాసాగర్, దుర్గేంద్ర, సందీప్లను జిల్లా ఎస్పీ నితికా పంత్ అభినందించారు.నిందితుడి వివరాలురాయిసిడం వినోద్ కుమార్, తండ్రి: భూమరావ్, వయస్సు: 30 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: పిట్టగూడ, తిర్యాణి మండలం.మృతుడి వివరాలుఉర్వేత హన్మంతరావ్, తండ్రి: లింగు, వయస్సు: 50 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: పిట్టగూడ, తిర్యాణి మండలం.





